ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ: కాంగ్రెస్ వార్​ రూమ్​ కేసు.. మల్లు రవికి పోలీసుల నోటీసులు - congress war room case latest update

Congress War Room Case: కాంగ్రేస్ సీనియర్ నేత మల్లు రవికి సీఆర్​పీసీ 41ఏ కింద సైబర్​క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్​ వార్​ రూమ్​ కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 12న పోలీసుల ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.

Mallu Ravi
మల్లు రవి

By

Published : Jan 9, 2023, 7:57 PM IST

Congress War Room Case: తెలంగాణ కాంగ్రెస్​ వార్​ రూమ్​ కేసులో మరో కాంగ్రెస్​ నేతకు సైబర్​క్రైమ్​ పోలీసుల నుంచి నోటీసులు అందాయి. సీనియర్​ నేత మల్లు రవికి సీఆర్​పీసీ 41ఏ కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ కనుగోలు ఇవాళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సునీల్​ కనుగోలును విచారించారు. వార్ రూమ్ విషయాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్​లపై వివరాలు సేకరించారు. మరోసారి విచారణకు పిలుస్తామని సునీల్​కు తెలిపారు.

మల్లు రవికి పోలీసుల ఇచ్చిన నోటీసులు

అసలు విషయం ఇదీ..: ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలతో గత నెల 14న పోలీసులు.. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని సునీల్‌ కార్యాలయంలో సోదాలు జరిపారు. అక్కడి కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు సునీల్‌ కనుగోలుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్‌ 30న విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 3న ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.

అయితే అప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయవద్దని, 8న సునీల్‌ విచారణకు హాజరు కావాల్సిందేనని సూచించింది. హైకోర్టు సూచనల మేరకు నిన్న విచారణకు రావాల్సి ఉండగా, ప్రత్యేక అభ్యర్థనతో ఇవాళ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ముందుకొచ్చారు. నేతలను కించపర్చటంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండటం, కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌ల్లో లభ్యమైన సమాచారం మేరకు పోలీసులు సునీల్‌ను ప్రశ్నించారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details