TRS MLAs Buying Issue: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంపై సైబరాబాద్ పోలీసులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ముగ్గురు నిందితులు 24 గంటల పాటు హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న ధర్మాసనం.. తమ నివాస ప్రాంత వివరాలు సైబరాబాద్ సీపీకి సమర్పించాలని ఆదేశించింది. కేసుతో సంబంధం ఉన్న వారెవరినీ సంప్రదించవద్దని నిందితులకు హైకోర్టు షరతు విధించింది.
తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురి నిందితులకు రిమాండ్ విధించడానికి.. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. అత్యవసర విచారణకు నిరాకరించిన హైకోర్టు.. సాధారణ పిటిషన్ వేయాలని సూచించింది. దీనిపై విచారించిన ధర్మాసనం.. విచారణను రేపటికి వాయిదా వేసింది.