ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్సై పేరుతో ఫేస్​బుక్ ఖాతా... అప్రమత్తంగా లేకుంటే బుక్కైపోతారు! - cyber crime target on police

సైబర్ నేరగాళ్లు పోలీసులను అడ్డుపెట్టుకుని మరీ మోసాలకు పాల్పడుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచి డబ్బులు గుంజేందుకు కేటుగాళ్లు ప్రయత్నించారు.

cyber crime with the name of tenali si at guntur district
ఎస్సై పేరుతో సైబర్ కేటుగాళ్ల నకిలీ ఫేస్ బుక్ ఖాతా

By

Published : Sep 24, 2020, 10:32 AM IST

సైబర్‌ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై అనిల్‌కుమార్‌ పేరిట, నేరుగా ఆయన చిత్రాన్నే ప్రొఫైల్‌గా వాడుతూ ఒక ఫేస్‌బుక్‌ ఖాతాను అజ్ఞాత వ్యక్తి తెరిచాడు. ఆ ఖాతా నుంచి.. ఎస్సై మిత్రులతో మెసెంజర్‌లో చాటింగ్‌ చేస్తూ తనకు అత్యవసరంగా కొంత నగదు అవసరమైందని, రెండు రోజుల్లో తిరిగిచ్చేస్తానని అడుగుతున్నాడు. ఖాతా నంబరు అడిగిన వారికి ఒక నంబరును కూడా ఇచ్చాడు.

ఈ క్రమంలో కొంత మందికి అనుమానం వచ్చి ఎస్సైకి ఫోన్‌ చేసి చెప్పగా.. మోసం వెలుగుచూసింది. వెంటనే ఆయన తన అసలు ఖాతా ద్వారా ఈ విషయం మొత్తం తెలియజేసి ఎవరూ నగదు పంపవద్దని కోరుతూ సమాచారం పంపారు. అజ్ఞాత వ్యక్తి ఖాతా గురించి ఆరా తీస్తే అది దిల్లీ, ఉత్తరప్రదేశ్‌ శివారులోని నోయిడా కేంద్రంగా దందా జరుగుతున్నట్టు తేలింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని ఎస్సై అనిల్‌కుమార్‌ ‘తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details