గుంటూరులో కర్ఫ్యూను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత అనుమతి లేని వాహనాలను ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. శంకర్ విలాస్ కూడలి, హిందూ కళాశాల సెంటర్, లాడ్జి సెంటర్, సంగడిగుంట తదితర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాదారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలిస్తున్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. కర్ఫ్యూ అమలు తీరును పరిశీలిస్తున్నారు. అత్యవసర సర్వీసులు మినహా ఎవరిని రహదారులపైకి అనుమతించడం లేదని.. ప్రజలు అనవసరంగా రోడ్డపైకి రావొద్దని ఎస్పీ హెచ్చరించారు.
ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావొద్దు: ఎస్పీ అమ్మిరెడ్డి - curfew in guntur latest news
గుంటూరులో కర్ఫ్యూను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావొద్దని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు.
కర్ఫ్యూ