పోలీస్ అమరవీరుల వారోత్సవాల భాగంగా అక్టోబర్ 21 నుంచి 31 వరకు ప్రతి రోజు ఓ కార్యక్రమమును గుంటూరు జిల్లావ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి. దీనిలో భాగంగా గుంటూరులోని హిందూ కళాశాల కూడలి వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులకు, వారి సేవలకు, వీరోచిత పోరాట ప్రతిమకు ఘన నివాళులు అర్పించారు. వట్టిచేరుకురు గ్రామానికి చెందిన ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ మృత్యువాత పడ్డారని.. అతని జయంతి సందర్భంగా మంగళవారం 500 మందికి అన్నదానం చేసినట్లు ఎస్పీ చెప్పారు.
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు - గుంటూరు హిందూ కళాశాల కూడలి
పోలీస్ అమరవీరుల వారోత్సవాల భాగంగా గుంటూరులో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసుల పనితీరు, శ్రమను వివరిస్తూ వారిలో నూతన ఉత్సాహాన్ని నింపడానికే హిందూ కళాశాల కూడలి వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు
ఈ కార్యక్రమంలో గుంటూరు అర్బన్, రూరల్ అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చదవండి: ప్రియుడిపై మోజుతో.. కన్న పిల్లలపై కర్కశం