గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బొబ్బర్లంక గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ (34) సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా రాజమండ్రి హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చిన అరుణ్ తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉరేసుకుని బలవన్మరణం..కుటుంబ కలహాలే కారణం - Guntur District Repalle Zone News
కుటుంబకలహాలతో మనస్తాపానికి గురైన ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలం బొబ్బర్లంక గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబకలహాలతో... సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉరేసుకుని బలవన్మరణం
ఘటనపై మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య కలహాలతోనే మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి