Crop Damage With Michaung Cyclone :మిగ్‌జాం తుపాను రైతులకు చేదు మిగిల్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వందల ఎకరాల్లో వరి పంట (Paddy Crop Damage) నీట మునిగి దెబ్బతింది. తడిసిన ధాన్యం ఆరబెట్టుకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నామని రైతులు అంటున్నారు. తుఫాన్ తగ్గి మూడు రోజులు కావస్తున్నా నేటికి రక్షణ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ తగ్గి మూడు రోజులైనా వ్యవసాయ అధికారులు పొలానికి వచ్చి పరిస్థితి ఏంటో తెలుసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. రైతు భరోసా అధికారులను ఇదే అంశంపై ప్రశ్నిస్తే ఫొటోలు తీసుకుని ఉంచండి ప్రభుత్వం చెబితే మేము రాస్తామని బదులిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Michaung Cyclone in AP :అప్పులు చేసి పండించిన అరటి పంట తుఫాన్ ధాటికి నెలకొరిగింది. మరో రెండు వారాల్లో పంట చేతికొస్తుందని భావిస్తే ఈ తుఫాన్ మా బతుకుల్లో దుఖాన్ని నింపిందని అరటి రైతులు ఆవేదన వక్తం చేస్తున్నారు. ఒక్కో రైతు పదుల ఎకరాలు కౌలుకు తీసుకుని అరటి పంట వేశాడు. పంట చేతికొచ్చి లాభాలు చూసే సమయానికి ప్రకృతి తీరనినష్టం మిగిల్చింది. ఎకరాకు 80 వేల నుంచి లక్ష రూపాయల పెట్టుబడి పెట్టామని ఒక్క పైసా తమ చేతికి వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు.
ఉప్పొంగిన కొండవీటి వాగు - చెరువులను తలపిస్తున్న పంట పొలాలు
AP Farmers Problems due to Heavy Rains :పల్నాడు జిల్లా రైతుల కష్టాల్ని మిగ్‌జాం తుపాను నీటి పాలు చేసింది. ఈ ఏడాది నీటి సమస్య ఎదురైనా వెనకడుగువేయకుండా రైతులు సాగుచేశారు. కష్టానికి ఫలితంగా ప్రత్తి, మిరప, కంది, మినుము కాపు ఆశాజనకంగానే ఉండటంతో అన్నదాతలు ఆనందపడ్డారు. వారి ఆనందాల్ని తుపాను దూరం చేసింది. వాగులన్నీ పొంగటంతో నరుకుళ్లపాడు, యనికపాడు , ఉంగుటూరు పెదమద్దూరులో పంటలన్నీ దెబ్బతిన్నాయి.