గుంటూరులో వినాయక విగ్రహాల విక్రయాలపై నగరపాలక సంస్థ అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి రోడ్డులోని ఐడీ ఆసుపత్రి వద్ద కొందరు వినాయక విగ్రహాలు విక్రయిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న నగరపాలక సంస్థ అధికారులు అక్కడికి చేరుకుని విగ్రహాలను బలవంతంగా వాహనాల్లో తీసుకెళ్లారు. వినాయక విగ్రహాల విక్రయానికి అనుమతి లేదంటూ చెత్త తరలించే ట్రాక్టర్లో ఉంచి తరలించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులతో విగ్రహాలు అమ్ముకునే వారు వాగ్వాదానికి దిగారు.
వినాయకా.. ఇదేం దుస్థితి స్వామి...! - guntur latest news
గుంటూరులో వినాయక ప్రతిమల విక్రయాలపై అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విక్రయానికి సిద్ధంగా ఉంచిన ప్రతిమలను.. అనుమతి లేదంటూ చెత్త తరలించే వాహనాల్లో అక్కడి నుంచి తీసుకెళ్లారు.
వినాయక విగ్రహాల విక్రయాలపై అధికారుల తీరుపై విమర్శలు