ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పులతో రోడ్డున పడుతున్న పరువు - ఆర్థికంగా రాష్ట్రం బలహీనంగా ఉందన్న ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్

Crisil Announcement of Lowering the Amaravati Bonds Rating: అప్పులతో ఆంధ్రప్రదేశ్‌ బలహీనంగా మారిందని ప్రముఖ రేటింగ్‌ సంస్థ క్రిసిల్ విశ్లేషించింది. చేబదుళ్లు, ఓవర్‌ డ్రాఫ్ట్‌తోనే ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నారని వెల్లడించింది. వడ్డీ చెల్లింపులకు తగ్గట్లుగా నిధులు లేవని స్పష్టం చేసింది. అమరావతి బాండ్ల రేటింగ్‌ను తగ్గిస్తున్నట్లు క్రిసిల్‌ సంస్థ ప్రకటించింది.

amaravati_bonds_rating
amaravati_bonds_rating

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 7:34 AM IST

Updated : Nov 9, 2023, 9:24 AM IST

అప్పులతో రోడ్డున పడుతున్న పరువు - ఆర్థికంగా రాష్ట్రం బలహీనంగా ఉందన్న ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్

Crisil Announcement of Lowering the Amaravati Bonds Rating:అందినకాడికి అధికారవైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్రం పరువు రోడ్డున పడుతోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నిర్వహణలో ( Andhra Pradesh Financial situation) బలహీనంగా ఉందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ (Rating agency CRISIL) తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే.. రాష్ట్ర స్థూల నికర ఉత్పత్తిలో 43 శాతం అప్పులు చేసేసిందని, చేబదుళ్లు, ప్రత్యేక ఆర్థిక సదుపాయం, ఓవర్ డ్రాఫ్ట్ తదితర రూపాల్లో రిజర్వు బ్యాంకు సహకరించడం వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్నారని స్పష్టం చేసింది.

Andhra Pradesh Top in Debts: ఐ డోంట్ కేర్ అంటున్న ఏపీ ప్రభుత్వం.. కాగ్‌ హెచ్చరికలు బేఖాతరు చేస్తూ అప్పుల్లో టాప్

ప్రస్తుతం బిబిబి+ తగ్గిన రేటింగ్‌..అమరావతి బాండ్లకు చెల్లించాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్​డీఏ ఉంచటంలేదని అందుకే రేటింగ్​ని తగ్గిస్తున్నామని క్రిసిల్ సంస్థ వెల్లడించింది. గతంలో ప్లస్ రేటింగ్‌లో ఉన్న అమరావతి బాండ్లు కిందటేడాది.. ఏ మైనస్ స్థాయికి వచ్చాయి. ప్రస్తుతం.. అక్కడి నుంచి ప్రస్తుతం బిబిబి+ రేటింగ్‌కు క్రిసిల్‌ తగ్గించింది. అమరావతి బాండ్లకు వడ్డీలు చెల్లించేందుకు ఏర్పాటు చేసుకున్న విధానం ప్రకారం అవసరమైన నిధులు ఆయా ఖాతాల్లో లేవని క్రిసిల్ స్పష్టం చేసింది. సీఆర్​డీఏ బాండ్లు (CRDA Bonds) జారీ చేసి 2 వేల కోట్ల రూపాయలు రుణం సమీకరించింది.

Tenders for Modernization of Harita Hotel in Visakha: వైజాగ్​లోని ఆ హోటల్​పైనే ఎందుకంత ప్రేమ.. హడావుడిగా టెండర్లు

Holding of Rating Due to Lack of Funding.. రాష్ట్ర ప్రభుత్వం ఈ బాండ్లకు గ్యారంటీ ఇచ్చింది. వీటికి ఎప్పటికప్పుడు వడ్డీలు చెల్లించాలి. అందుకు కావల్సిన నిధులు ప్రభుత్వం నుంచి అందట్లేదు. డెట్ సర్వీసు రిజర్వు అకౌంట్, బాండ్ల సర్వీసింగ్ అకౌంట్ ద్వారా చెల్లించాలి. రాబోయే రెండు త్రైమాసికాలకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం ముందే ఆ ఖాతాకు చేర్చాలి. అంత మొత్తం అందులో లేకపోతే ట్రస్టీ డెట్ సర్వీసు రిజర్వు ఖాతా నుంచి ఆ మొత్తం తీసుకోవాలి. నిధులు లేకపోవడంతో 2023 అక్టోబరు 19న ఈ బాండ్లపై రేటింగ్‌ను నిలిపివేశారు.

Siemens Industry Software India MD Matthew Thomas: 'స్వయంగా సీమెన్స్‌ ఎండీ వివరించినా.. వైసీపీ నేతలకు కనిపించవు.. అవినీతి నిందలకు మాత్రం పోటీ'

Shortage of Funds in Accounts.. డెట్ సర్వీసు రిజర్వు అకౌంట్‌లో 300 కోట్ల రూపాయలు ఉండాలి. అయితే 204 కోట్ల రూపాయలే ఉన్నాయి. బాండ్ల సర్వీసింగ్ అకౌంట్‌లో 225 కోట్ల రూపాయలు ఉండాలి. కానీ 27 కోట్ల రూపాయలే ఉన్నాయి. ఈ రెండింటి లోటును భర్తీ చేసుకునేందుకు 178 కోట్ల రూపాయలు కావాలని, మరో 570 కోట్ల రూపాయలు అదనపు బడ్జెట్ కావాలని సీఆర్​డీఏ.. ఏపీ ప్రభుత్వాన్ని 2023 ఆగస్టు 16న కోరింది. ప్రభుత్వం స్పందించలేదు. ఈ అన్ని కారణాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలో తీసుకుని బాండ్ల రేటింగ్ను క్రిసిల్ తగ్గించింది.

Last Updated : Nov 9, 2023, 9:24 AM IST

ABOUT THE AUTHOR

...view details