ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నల్లచెరువులో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ - గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్

గుంటూరు జిల్లాలోని నల్లచెరువు ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను లాలాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.7లక్షల 92వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు లాలాపేట సీఐ ఫిరోజ్ తెలిపారు.

cricket betting gang arrested in nallacheruvu at guntur district
నల్లచెరువులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్

By

Published : Nov 6, 2020, 9:30 PM IST

గుంటూరు నగర శివారులో గల నల్లచెరువు ప్రాంతంలోని మేనకాగాంధి నగర్ లో... తాతినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో... కొందరు వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహించారు. శ్రీనివాస రావుతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితులు వద్ద నుంచి ఒక ల్యాప్ టాప్, 7 చరవాణీలు, రూ.7లక్షల 92వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details