ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా ఇష్టంతోనే అమ్ముతున్నాం.. మీకేంటి బాధ' - రైతులు

చిలకలూరిపేట మండలం యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటీ భూములను శనివారం పరిశీలించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అక్కడి ఎస్సీ కాలనీలో రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం.. భూములు తీసుకునే పక్షంలో ఎకరాకు రైతులకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు

By

Published : Sep 4, 2021, 6:25 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు చేదు అనుభవం ఎదురైంది. తమకు ప్రభుత్వం పరిహారం చెల్లించి భూములు తీసుకునేందుకు అనుకూలంగా ఉంటే.. మీరు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ మధు కారును ఆపి చిలకలూరిపేట రైతులు కొందరు ప్రశ్నించారు. ఆయన కారును అడ్డుకున్నారు. అయితే భూములు ఇవ్వడానికి మరికొందరు రైతులు వ్యతిరేకత తెలిపారు. భూములు ఇవ్వడానికి అనుకూల, వ్యతిరేక రైతులు ఘర్షణకు దిగారు. కాగా పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు.

అంతకుముందు యడవల్లి గ్రామంలో వీకర్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటీ భూములను శనివారం సందర్శించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఎన్నికల ముందు పట్టాలు ఇస్తానన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ప్రస్తుతం వారి భూములు లాగేసుకుంటున్నారని విమర్శించారు. రైతుల వద్ద నుంచి నిజంగా తీసుకోవాలనుకుంటే వారికి ఎకరాకు కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:CPM: సీపీఎం ఆధ్వర్యంలో 15 రోజులు నిరసన.. ఎందుకంటే..

ABOUT THE AUTHOR

...view details