రొయ్యల చెరువులో పని చేసే కార్మికులకు కనీస భద్రత కల్పించడంలో యాజమాన్యాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపణలు చేశారు. గుంటురు జిల్లా రేపల్లె మండలం లంకవానిదిబ్బలో అగ్ని ప్రమాదం జరిగిన రొయ్యల చెరువు వద్దకు రాగా.. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో కాసేపు వాగ్వాదం జరిగింది. రొయ్యల చెరువు యజమానిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మధు డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కోరారు.
CPM Madhu: 'రొయ్యల చెరువు యజమానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి' - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తాజావార్తలు
గుంటురు జిల్లా రేపల్లె మండలం లంకవానిదిబ్బలో అగ్ని ప్రమాదం జరిగిన చోటును సందర్శించేందుకు.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు రాగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కాసేపు వాగ్వాదం జరిగింది. రొయ్యల చెరువులో పని చేసే కార్మికులకు కనీస భద్రత కల్పించడంలో యాజమాన్యాలు విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు.
రొయ్యల చెరువు యజమానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి