కృష్ణా నది వరదల వల్ల పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో వరద ప్రభావంతో నీటమునిగిన తాడేపల్లి మండలం గుండిమెడ, చిర్రావూరులోని పంట పొలాలను పరిశీలించారు.
అక్కడి ప్రైవేటు విశ్వవిద్యాలయం అక్రమ నిర్మాణాల వల్ల నీళ్లు ఎక్కడికక్కడ నిలిచి తమ పంట పొలాలు మునిగాయని రైతులు మధుకి చెప్పారు. ఈ విషయమై కళాశాల యాజమాన్యంతో చర్చించేందుకు వెళ్లగా.. వారిని సెక్యురిటీ సిబ్బంది అడ్డగించారు. దీంతో ఆగ్రహించిన నేతలు.. మధు కళాశాల గేటును నెట్టుకుంటూ లోపలికి వెళ్లారు. ఈనెల 21 లోపు కాలువలకు అడ్డంగా నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.