గుంటూరు జిల్లా తాడేపల్లి నులకపేటలో ఫారెస్ట్ ఏరియా ఇళ్ల రెగ్యులరైజేషన్ అండ్ ఇళ్ల పునఃనిర్మాణ సాధన కమిటీ నిర్వహించిన సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కూడా స్థలాలు ఇవ్వకుండా.. ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయని ఆరోపించారు.
ఈనెల 25 నుంచి రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలతో పాటు వాటి నిర్మాణానికి ఆర్దిక సహాయం చేస్తామని ప్రకటించిందని... వాటికి అదనంగా మరో 2 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే సమస్య తాత్కాలికంగా పరిష్కారం అవుతుందని అన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.