కరోనా మరణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని.. రాష్ట్రప్రభుత్వం కూడా తన బాధ్యత నెరవేర్చడంలో విఫలమైందని మధు ఆరోపించారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం యూనివర్సల్ వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరా చేపట్టాలని సీఎంకు లేఖ రాస్తున్నట్లు చెప్పారు. గుంటూరు బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో జాషువా విజ్ఞానకేంద్రం, యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని మధు పరిశీలించారు. ఇటీవల కరోనాతో మృతిచెందిన యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాన మల్లేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే కరోనా మరణాలు ' - రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనత వల్లే కరోనా మరణాలు సంభవిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు విమర్శించారు. ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైందన్నారు.
cpm leader madhu