CPM RAGHAVULU COMMENTS ON CM JAGAN : రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఏం కావాలో ప్రశ్నించకుండా.. ప్రధాన మంత్రిని సీఎం జగన్ ప్రాధేయపడుతున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. సీఎం జగన్ తెలుగులో సమస్యలు చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుందని అనుకోవడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ.. విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, విభజన చట్టం, ప్రత్యేక హోదా పై కనీసం వివరణ కూడా ఇవ్వలేదన్నారు. ప్రధానితో సాన్నిహిత్యం ఉందన్న జగన్.. మరి ఆయనతో ప్రత్యేక సమావేశాన్ని ఎందుకు కోరలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ భేటి అయ్యారని.. అయితే భేటీ వివరాలు మాత్రం పవన్ కల్యాణ్ బయట పెట్టలేదన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగాల్సిన బాధ్యత మిత్ర పార్టీగా పవన్కిి ఉందన్నారు.
ప్రధానమంత్రిని జగన్ గట్టిగా అడగకుండా.. ప్రాధేయపడటం సరికాదు: బీవీ రాఘవులు
CPM RAGHAVULU ON JAGAN : రాష్ట్రానికి ఏంకావాలో ప్రధానమంత్రిని గట్టిగా అడగకుండా.. ముఖ్యమంత్రి జగన్ ప్రాధేయపడటం సరికాదని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. అది కూడా తెలుగులో అడిగితే ప్రధానికి ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు.
CPM RAGHAVULU ON JAGAN