దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిందని...సాధారణ ప్రజలకు కష్టకాలం వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో నెలకొన్న సమస్యలపై అక్టోబర్ 10 నుండి 16 వరకు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం పదే పదే అన్యాయం చేస్తుందని.. రైల్వే జోన్ గాలికి వదిలేశారన్నారు. రాజధాని నిర్మాణం కోసం నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతుందన్నారు. గతంలో చంద్రబాబు అడిగినా ఇవ్వలేదని...ఇప్పుడు జగన్ అడిగే పరిస్థితి లేదన్నారు. ఆంధ్రాబ్యాంక్ను యూనియన్ బ్యాంక్లో ఎందుకు వీలీనం చేస్తున్నారని ద్వజమెత్తారు. ఆంధ్రాబ్యాంక్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 28న ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్నఅన్యాయంపై భాజాపా నేతలు ఎందుకు మాట్లాడటం లేదని విమర్శలు గుప్పించారు. యురేనియం తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈ నెల 29న విజయవాడలో యురేనియం తవ్వకాలపై అన్ని పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి కార్యచరణ రూపొందిస్తామన్నారు.
దేశంలో నెలకొన్న సమస్యలపై నిరసనలకు సీపీఐ నిర్ణయం - ఆంధ్రాబ్యాంక్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 28న ర్యాలీ
దేశంలో నెలకొన్న సమస్యలపై అక్టోబర్ 10 నుండి 16 వరకు దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఐ స్పష్టం చేసింది. రాష్ట్రానికి కేంద్రం ప్రతిసారి అన్యాయం చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గుంటూరులో తెలిపారు.
cpi secretary ramakrishna in guntur latest