ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీసు రాజ్యమా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి - CPI State Secretary Ramakrishna Criticized

cpi state secretary fires on ycp: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వైకాపాపై మండిపడ్డారు. ఏపీలో నడిచేది ప్రజాస్వామ్యమా లేక పోలీసు రాజ్యమా? అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని మార్చాలనే మంత్రులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అమరావతి రైతుల పాదయాత్ర సజావుగా సాగేలా చూడాలన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

By

Published : Oct 22, 2022, 6:18 PM IST

cpi state secretary fires on ycp: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వైకాపా పై మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీసు రాజ్యమా అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని మార్చాలనే మంత్రులు డ్రామాలు కట్టిపెట్టి, రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి పాదయాత్రపై వైకాపా వర్గీయులు దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రైతులపై పోలీసు జులుం ప్రదర్శించడాన్ని, పాదయాత్రను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే అమరావతి రైతుల పాదయాత్ర సజావుగా సాగేలా చూడాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details