CPI State Secretary K.Ramakrishna: ముఖ్యమంత్రి జగన్కు జనం గోడు వినే తీరిక లేదా.. లేక ఎందుకు వినాలన్న అహంభావమా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నిలదీశారు. సీఎంకు తమ సమస్యను విన్నవించే అవకాశం లేక అమలాపురానికి చెందిన ఆరుద్ర అనే యువతి సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం దారుణమన్నారు.సీఎం జగన్కు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదని ధ్వజమెత్తారు.
సీఎం జగన్కు జనం గోడు వినే తీరిక లేదా..?: సీపీఐ నేత రామకృష్ణ - AP News
CPI State Secretary K.Ramakrishna: ముఖ్యమంత్రి జగన్కు జనం గోడు వినే తీరిక లేదా.., లేక ఎందుకు వినాలన్న అహంభావమా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నిలదీశారు. సీఎంకు తమ సమస్యను విన్నవించే అవకాశం లేక అమలాపురానికి చెందిన ఆరుద్ర అనే యువతి సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఆత్మహత్యకి పాల్పడటం దారుణమన్నారు.
ముఖ్యమంత్రికి సచివాలయం నుంచి పాలన లేదని.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ముళ్లకంచెలు, పోలీస్ పహారా మధ్య మాత్రమే ఉంటున్నారని విమర్శించారు. ప్రజా వినతులు స్వీకరించే ఆలోచన సీఎంకు లేదన్నారు. వైకాపా అధికారం చేపట్టిన నాటి నుంచి అఖిలపక్ష సమావేశాలు లేవన్న రామకృష్ణ.. రాష్ట్రంలో కేవలం నిర్బంధకాండలు, అణిచివేతలతో నియంత పాలన మాత్రమే సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుద్రను కానిస్టేబుల్ వేధింపుల నుండి రక్షించి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: