రాజధాని అమరావతిని తరలిస్తే మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని... సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులు తమ భూములను రాజధాని కోసం ఇచ్చారా? ఇళ్ల స్థలాల కోసం ఇచ్చారో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీలను విమర్శించే నైతికహక్కు నానికి లేదని ధ్వజమెత్తారు.
'రాజధానిని తరలిస్తే వైకాపా నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు' - cpi assistant secretary news
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే... వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు చరిత్ర హానులుగా మిగిలిపోతారని మండిపడ్డారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు