ముఖ్యమంత్రి జగన్... క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే రైతుల ఇబ్బందులు తెలుస్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వరదలతో నష్టపోయిన రైతులకు... ఒక్కో ఎకరాకు రూ.25వేలు పరిహారం అందించాలని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని చిర్రావూరు, గుండిమెడ, దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామాల్లో రామకృష్ణ పర్యటించారు. నీట మునిగిన పొలాలను పరిశీలించారు. పంటనష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు తక్షణమే పరిహారంతో పాటు బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి' - news updates in guntur district
గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత గ్రామాల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ