ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ భూముల అమ్మకాలపై సీపీఐ రౌండ్​ టేబుల్​ సమావేశం - ప్రభుత్వ స్థలాలు అమ్మకం తాజా వార్తలు

గుంటూరులో సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ స్థలాలు అమ్మకాలపై జరిగిన ఈ సమావేశంలో.. రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వ తీరుని తప్పుబట్టాయి. బిల్డ్ ఏపీ పేరిట బిల్డ్ జగన్ అమలు చేస్తున్నారని పలువురు నేతలు దుయ్యబట్టారు.

cpi round table meeting on government lands
ప్రభుత్వ భూములు అమ్మకాలపై సీపీఐ రౌండ్​ టేబుల్​ సమావేశం

By

Published : May 22, 2020, 3:54 PM IST

బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ స్థలాల అమ్మకాలపై సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు తరాల కోసం ఉపయోగపడాల్సిన స్థలాల్ని అమ్మటంపై తెదేపా, వామపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గుంటూరులో కీలకమైన కూరగాయల మార్కెట్​ను బిల్డ్ ఏపీ పేరుతో అమ్మటంపై శాసనమండలి సభ్యులు రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు మార్కెట్ స్థలాన్ని కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. పది వేల మందికి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే మార్కెట్​ను వేలం వేయటం అంటే... వారందరినీ రోడ్డున పడేయటమేననని సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details