ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మా పిలుపుతో ప్రభుత్వం దిగొచ్చింది: సీపీఐ రామకృష్ణ - టి్డ్కో ఇళ్లపై సీపీఐ రామకృష్ణ వ్యాఖ్యలు

రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల ప్రవేశాలకు తాము ఇచ్చిన పిలుపుతో ప్రభుత్వం దిగొచ్చిందని సీపీఐ రామకృష్ణ అన్నారు. లబ్ధిదారులకు గృహాలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారన్నారు. గృహాల ఆక్రమణకు పిలుపునిచ్చినందుకు ఆయనను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

cpi ramakrishna
రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

By

Published : Nov 16, 2020, 12:08 PM IST

టిడ్కో ఇళ్ల ప్రవేశాలకు పిలుపునిచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధంలో ఉంచారు. మరోవైపు తుళ్లూరులో ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావును అరెస్టు చేసి అమరావతి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

సీపీఐ గృహ ప్రవేశాల పిలుపుతో ప్రభుత్వం దిగొచ్చిందని రామకృష్ణ అన్నారు. ఇది తమ విజయంగా ఆయన అభివర్ణించారు. సీపీఐ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు గృహాలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారన్నారు. ప్రభుత్వం వెంటనే మౌలిక వసతులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లు అందించాలని డిమాండ్ చేశారు.

ఈరోజు లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇది కచ్చితంగా మా విజయమే. గృహ ప్రవేశాల పిలుపుతో సర్కారులో కదలిక వచ్చింది. అయినా సరే మా పోరాటం ఆగదు. ఇళ్లకు సరైన మౌలిక వసతులు లేవు. అవన్నీ కల్పించి ఇవ్వాలి. అలాగే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అప్పటివరకూ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఇవీ చదవండి..

మళ్లీ కేంద్ర సర్వీసుకు ప్రవీణ్‌ ప్రకాశ్‌!

ABOUT THE AUTHOR

...view details