ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయి: సీపీఐ రామకృష్ణ - cpi ramkrishna agitation on lands

గుంటూరు శారదా కాలనీలో అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.

cpi agitation
ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ మండిపాటు

By

Published : Jul 14, 2020, 3:01 PM IST

పేదలకు ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. వీటిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు శారదా కాలనీలో ఆందోళనకు దిగిన రామకృష్ణ, ప్రభుత్వం ఇస్తామన్న సెంటు, సెంటున్నర స్థలాలు ఏ మూలకు సరిపోవన్నారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని రామకృష్ణ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details