జగన్ ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. గుంటూరు ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న ఆయన..రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగంలో సంక్షేమ కార్యక్రమాలకు ఏకరువు పెట్టడం తప్ప.. అప్పుల గురించి ఎలాంటి ప్రస్తావనా లేదన్నారు. ఎన్నివేల కోట్లు అప్పు తెచ్చారు.. ఎక్కడ ఖర్చు పెట్టారు అనే వివరాలు చెప్పలేదన్నారు.
గవర్నర్ బడ్జెట్ ప్రసంగం కరపత్రంలా ఉందని రామకృష్ణ ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని.. కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వరంగ ఆస్తులను దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆక్షేపించారు.