విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అయితే.. రాష్ట్రంలో వైకాపా భూస్థాపితం అవుతుందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకునేందుకు పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత ఆందోళన ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. భాజపా తీరుపై మండిపడ్డ ఆయన రాష్ట్ర భాజపా నేతలు ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. భాజపా మోసం చేస్తుంటే పవన్ కళ్యాణ్ వారితో ఎలా కలిసి ఉన్నారని ప్రశ్నించారు. పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే భాజపాను విడిచి పోరాడాలన్నారు. రాజధాని మహిళల పట్ల పోలీసుల తీరును రామకృష్ణ ఖండించారు.
'ఓట్ల లెక్కింపు అనంతరం.. ఆందోళన ఉద్ధృతం చేస్తాం' - విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ తాజా వ్యాఖ్యలు
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకునేందుకు పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత ఆందోళన ఉద్ధృతం చేస్తామని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అయితే.. రాష్ట్రంలో వైకాపా భూస్థాపితం అవుతుందని ఆయన హెచ్చరించారు.
సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ