తమ్మినేని.. స్పీకర్ స్థానానికి పనికిరారు..: రామకృష్ణ - న్యాయ వ్యవస్థపై తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు
స్పీకర్ స్థానాన్ని దిగజార్చేలా తమ్మినేని సీతారాం వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరులో ఆయన మండిపడ్డారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పు బట్టారు. స్పీకర్ స్థానాన్ని దిగజార్చేలా తమ్మినేని వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి వ్యక్తి సభాపతి స్థానానికి తగరని అభిప్రాయపడ్డారు. అంతగా ఆసక్తి ఉంటే జగన్మోహన్రెడ్డి మంత్రి వర్గంలో తీసుకుంటే మంచిందని రామకృష్ణ సూచించారు.