ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చిత్తశుద్ధి ఉంటే పోలవరంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి' - సీపీఐ రామకృష్ణ తాజా వార్తలు

పోలవరం ఏ ఒక్క పార్టీ అజెండా కాదని.., రాష్ట్ర ప్రజల ఉమ్మడి అజెండా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. పోలవరం నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని.., కేంద్రంపై పోరాటానికి ఉమ్మడిగా కలిసి రావాలని డిమాండ్ చేశారు.

సీపీఐ రామకృష్ణ
సీపీఐ రామకృష్ణ

By

Published : Nov 24, 2020, 4:06 PM IST

పోలవరం నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని.., కేంద్రంపై పోరాటానికి ఉమ్మడిగా కలిసి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పోలవరం ఏ ఒక్క పార్టీ అజెండా కాదని.., రాష్ట్ర ప్రజల ఉమ్మడి అజెండాగా అభివర్ణించారు. పోలవరాన్ని సందర్శనకు వెళితే.. ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో స్పష్టం చేయాలన్నారు. చంద్రబాబు, సీపీఐ కవల పిల్లలని మంత్రి అనిల్ చేసిన వ్యాఖ్యలను రామకృష్ణ తిప్పికొట్టారు. 1925లో పుట్టిన సీపీఐ, చంద్రబాబు ఎలా కవలలు అవుతారో చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

గతంలో పోలవరాన్ని తాను సందర్శించానని గుర్తు చేసిన రామకృష్ణ...ప్రాజెక్టుపై మంత్రి అనిల్ కుమార్ అవగాహన ఏర్పరచుకోవాలని హితవు పలికారు. ఈ నెల 26న జరగనున్న సార్వత్రిక సమ్మెను కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details