కరోనా తీవ్రతపై సీఎం నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు తగదని సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాను జ్వరంతో పోలుస్తూ.. అది మనతో పాటే ఉంటుందనడం విచారకరమని ఆక్షేపించారు. కరోనా రోజురోజుకీ ప్రమాదకరంగా విస్తరిస్తోందన్నారు. రాజ్‌భవన్ సిబ్బందికి ఆరోగ్యశాఖ మంత్రి సిబ్బందికి కరోనా సోకిందని రామకృష్ణ అన్నారు. సీఎం పేషీలోనూ కరోనా వస్తే తప్ప అది ప్రమాదకరమని గుర్తించరా అని రామకృష్ణ ప్రశ్నించారు.
'సీఎం పేషీలోనూ కరోనా వస్తేగాని అది ప్రమాదకరమని గుర్తించరా.?'
కరోనాను జ్వరంతో పోలుస్తూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తోందన్నారు. సీఎం పేషీలోనూ కరోనా వస్తే తప్ప అది ప్రమాదకమని గుర్తించారా అని నిలదీశారు.
సీఎం జగన్‌పై సీపీఐ రామకృష్ణ ఆగ్రహం