ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టిడ్కో ఇళ్లలో లబ్దిదారులకు ప్రవేశాలు కల్పించాలని సీపీఐ ఆందోళనలు - CPI dharna news in Nandyal

సీపీఐ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహాలలో లబ్ధిదారులకు ప్రవేశం కల్పించాలని ఆందోళనలు చేపట్టారు. కొన్నిచోట్ల నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. నంద్యాలలో సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు ర్యాలీ నిర్వహించారు.

టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు కల్పించాలని సీపీఐ ఆందోళనలు
టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు కల్పించాలని సీపీఐ ఆందోళనలు

By

Published : Nov 16, 2020, 12:14 PM IST

టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు కల్పించాలని సీపీఐ ఆందోళనలు

రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో నేటి నుంచి సంక్రాంతి పండుగ వరకు సీపీఐ ఆధ్వర్యంలో గృహ ప్రవేశాలు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు టిడ్కో గృహాలలో లబ్ధిదారులకు ప్రవేశం కల్పించాలని నంద్యాలలో సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఎస్సార్బీసీ కాలనీలో ఉన్న గృహల వద్దకు వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్లో ఎక్కించి పోలీసు స్టేషనుకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details