మూడు రాజధానుల నిర్ణయాన్ని నిరసిస్తూ... అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి నిరాహార దీక్షలు తిరిగి ప్రారంభిస్తున్నామని గుంటూరు జిల్లా సీపీఐ కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కార్యాలయాల్లో నిరసన దీక్షలు చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు పునః ప్రారంభం - అమరావతి జేఏసీ తాజా వార్తలు
జూన్ 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కార్యాలయాల్లో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయని సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయని చెబుతున్న సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్