గత ప్రభుత్వ హయాంలో గుంటూరు నగరంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సీపీఐ నాయకులు సందర్శించారు. స్వర్ణ భారత్నగర్లో నిర్మించిన ఇళ్లను అర్హులైన వారికి తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సంబంధిత లబ్ధిదారులను సమీకరించి గృహాలను ఆక్రమిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తామంటున్న ఇళ్ల స్థలాలు ఏమాత్రం సరిపోవని వ్యాఖ్యానించారు. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇళ్లస్థలాలు ఇవ్వటం ద్వారా ఉపయోగం లేదన్నారు.
టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలి: సీపీఐ - cpi protest over tdko houses in guntur
గత ప్రభుత్వహయాంలో గుంటూరు నగరంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను తక్షణమే అర్హులకు పంపిణీ చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. లేకుంటే సంబంధిత లబ్ధిదారులను సమీకరించి గృహాలను ఆక్రమిస్తామని హెచ్చరించారు.

టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలి