లబ్ధిదారులతో కలిసి రేపటినుంచి టిడ్కో ఇళ్ల ఆక్రమణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలో నేతలు సమావేశమయ్యారు. విజయవాడలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాజధాని ప్రాంతంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈనెల 19న మంగళగిరిలో ఇళ్ల ఆక్రమణ కార్యక్రమం నిర్వహించనునట్లు వివరించారు. ప్రభుత్వ అలసత్వ ధోరణి వల్ల వేల కోట్లు వెచ్చించి నిర్మించిన గృహాలు నిరుపయోగంగా మిగిలాయని నేతలు పేర్కొన్నారు.
రేపటినుంచి టిడ్కో ఇళ్లలో ప్రవేశాలు చేపడతాం: సీపీఐ - గుంటూరు జిల్లా మంగళగిరి
పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్ల ఆక్రమణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సీపీఐ పేర్కొంది. రేపటి నుంచి లబ్ధిదారులతో కలసి గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని వివరించింది. ప్రభుత్వ అలసత్వ ధోరణి వల్ల వేల కోట్లు వెచ్చించి నిర్మించిన గృహాలు శిథిలావస్థకు చేరుతున్నాయని తెలిపింది.
రేపటి నుంచి టిడ్కో ఇళ్ల ఆక్రమణ కార్యక్రమం చేపడతాం: సీపీఐ