ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్‌, చంద్రబాబు.. అందరినీ కలుపుకొని పోరాడాలి: నారాయణ - విశాఖ ఉక్కు ఉద్యమం

పోస్కోను ఎట్టి పరిస్థితుల్లో విశాఖకు రానివ్వబోమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్, తెదేపా అధినేత చంద్రబాబు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోరాడాలని సూచించారు.

సీపీఐ నారాయణ
cpi narayana

By

Published : Feb 20, 2021, 8:44 AM IST

విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు సీఎం జగన్, చంద్రబాబు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోరాడాలని... సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. సీఎం జగన్ చెప్తున్న అసెంబ్లీ తీర్మానం... దేనికి పనికిరాదని ఎద్దేవా చేశారు.

విశాఖపట్నానికి పోస్కో వస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. వేల కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. భాజపాను ఎదుర్కొనేందుకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details