అన్ని జిల్లాలకు సమదూరంలో ఉన్న అమరావతినే రాజధానిగా ఉంచాలని, భావితరాల ఉజ్వల భవిష్యత్తును నాశనం చెయ్యొద్దని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. రాజధాని రైతుల నిరసనకు మద్దతుగా గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో ఐక్యకార్యచరణ కమిటీ, సీపీఐ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. మూడు రాజధానుల కుట్రను ప్రతిఘటిస్తామని పేర్కొన్నారు. రైతులపై చేస్తున్న బలవంతపు కుట్రలను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్దంగా వున్నారని హెచ్చరించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారని ముప్పాళ్ల ఆరోపించారు.
రాజధాని రైతులకు మద్దతుగా సీపీఐ దీక్ష - amaravati farmers protest news
రాజధాని రైతుల నిరసనకు మద్దతుగా గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో ఐక్యకార్యచరణ కమిటీ, సీపీఐ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించేలా ముఖ్యమంత్రి మనసు మారాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆకాంక్షించారు.
రాజధాని రైతులకు మద్దతుగా సీపీఐ దీక్ష