గుంటూరు శ్రామిక నగర్లో ఇంటి పట్టాలు, మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సీపీఐ-ఎంఎల్ ఆధ్వర్యంలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట స్థానికులు ధర్నా నిర్వహించారు. ఏళ్లుగా ఇక్కడే నివాసముంటున్న తమకు నివాసపు హక్కు కల్పించాలని.. రోడ్లు, మురుగు కాల్వలు, వీధిలైట్లు, మరుగుదొడ్లు, పాఠశాల వంటి కనీస సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వేల కోట్లు రూపాయిలు వెచ్చించి 30 లక్షల మందికి ఇంటి స్థలాలు, పట్టాలు ఇచ్చామని ప్రచారం చేసుకుంటోందని.. ప్రభుత్వ స్థలంలో దశాబ్దకాలంగా నివాసముంటున్నవారు ప్రజలు కాదా? అని సీపీఐ-ఎంఎల్ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి పోరాటాల ద్వారా సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.