చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాలలో పీఎంఏవై పథకం ద్వారా నిర్మించిన 4370 గృహాలను లబ్ధిదారులైన పేదలకు వెంటనే పంపిణీ చేయాలని సీపీఐ ఏరియా కార్యదర్శి మోహన్ డిమాండ్ చేశారు. గృహాలకు సంబంధించి పోరాట కార్యక్రమాల కరపత్రాన్ని చిలకలూరిపేట పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరుపేదల కోసం అనేక పోరాటాల చేసిన ఫలితంగా చిలకలూరిపేటలో 52 ఎకరాల భూమిని ఆనాటి ప్రభుత్వం కొనుగోలు చేసిందని, తర్వాత తెదేపా ప్రభుత్వం సుమారు 4371 ఇళ్ళు బహుళ అంతస్తుల రూపంలో నిర్మించి 90 శాతం పూర్తి చేసిందని మోహన్ అన్నారు.
"పీఎంఏవై గృహాలను తక్షణమే లబ్దిదారులకు పంపిణీ చేయాలి" - guntur district latest updates
చిలకలూరిపేటలో నిర్మించిన పీఎంఏవై గృహాలను తక్షణమే లబ్దిదారులకు పంపిణీ చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 16న గృహ ప్రవేశ పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు.
దీనికి లబ్ధిదారులు డిపాజిట్ల రూపంలో కొంత డబ్బు కూడా చెల్లించారన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఇంతవరకూ వాటిని పంపిణీ చేయకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు. ఈనెల 11, 12 తేదీలలో రెండు రోజులపాటు లబ్ధిదారులతో దీక్షలు చేపట్టనున్నట్లు వివరించారు. అప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేకపోతే నవంబర్ 16వ తేదీన లబ్దిదారులను సమీకరించి వారికి కేటాయించిన ఇళ్లలోకి గృహ ప్రవేశాలు చేయిస్తామని తెలిపారు. లబ్ధిదారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి