ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తాము.. - CPI leaders visits homeless victims in Atmakuru

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇళ్లు కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని.. సీపీఐ నేతలు తెలిపారు. న్యాయస్థానం ఉత్తర్వులను ధిక్కరించి ఇళ్లు కూల్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

CPI leaders
ఇళ్ల కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తాము

By

Published : Mar 24, 2021, 1:38 PM IST

ఆత్మకూరులో ఇళ్ల కోల్పోయిన బాధితులను.. సీపీఐ నేతలు పరామర్శించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గతంలో ఉండవల్లి, పెనుమాకలలో బాధితుల తరపున చేసిన పోరాటం మర్చిపోయారా....? అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రశ్నించారు. నాడు ఎమ్మెల్యేలు భూ నిర్వాసితులకు రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని డిమాండ్​ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక.. ఆళ్ల రామకృష్ణారెడ్డి వాటిని మర్చిపోయారా అని నాగేశ్వరరావు ప్రశ్నించారు. న్యాయస్థానం ఉత్తర్వులను ధిక్కరించి.. ఇళ్లు కూల్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details