ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైతులను ఆదుకోవాలి: సీపీఐ నేతలు

లాక్​డౌన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవాలని గుంటూరులో సీపీఐ నాయకులు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రికి మద్యం దుకాణాలు తెరవటంపై ఉన్న శ్రద్ధ ... రైతులను ఆదుకోవటంపై లేదని సీపీఐ సీనియర్ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు.

By

Published : May 11, 2020, 5:16 PM IST

Published : May 11, 2020, 5:16 PM IST

CPI leaders demand to help farmers due to corona affect
రైతులను ఆదుకోవాలని సీపీఐ నేతల డిమాండ్

రాష్ట్రంలో రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. లాక్ డౌన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని... వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టలేదని సీపీఐ సీనియర్ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. సీఎంకు మద్యం దుకాణాలు తెరవటంపై ఉన్న శ్రద్ధ ... రైతులను ఆదుకోవటంపై లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూసే విధానం మానుకోవాలని సూచించారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి రైతులను ఆదుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:ద్యం దుకాణాలు మూసివేయాలని సీపీఎం డిమాండ్

ABOUT THE AUTHOR

...view details