ఇసుక కొరతను నిరసిస్తూ... గుంటూరు జిల్లాలో ధర్నాకు పిలుపునిచ్చిన సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇసుక రీచ్లు, డంపింగ్ యార్డుల వద్ద ధర్నాకు యత్నించిన నేతలను అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లి మండలం పాతూరులో ఇసుక రీచ్ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న... సీపీఐ నాయకులను సీఐ అంకమరావు అరెస్టు చేశారు. మంగళగిరి మండలం నవులూరు ఇసుక డంపింగ్ యార్డులో ధర్నాకు యత్నించిన నేతలను అదుపులోకి తీసుకున్నారు. 2 మండలాల్లో దాదాపు 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
గుంటూరులో సీపీఐ నేతల అరెస్టు... ఎందుకంటే.. - ఇసుక కొరతను నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చిన సీపీఐ నేతలు అరెస్టు
గుంటూరు జిల్లాలో ఇసుక కొరతపై ధర్నాకు పిలుపునిచ్చిన సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో దాదాపు 20 మంది సీపీఐ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరులో సీపీఐ నేతల అరెస్టు