CPI Leader Narayana Fires on CM Jagan:సీపీఐ పొత్తు వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల మెజార్టీకి సీపీఐ ఓట్లు దోహదం చేశాయని తెలిపారు. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీనిని గుణపాఠంగా తీసుకోవాలని వ్యాఖ్యానించారు.
''వామపక్ష తీవ్ర వాదాన్ని అణచాలన్న ప్రభావం సీపీఐపై పడింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఒంటెద్దు పోకడల వల్లే ఓడిపోయింది. తెలంగాణలో అందరినీ కలుపుకొనిపోయింది కాబట్టే కాంగ్రెస్ విజయం సాధించింది. ఇండియా కూటమి ఎంత అవసరమో, కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కలుపుకొని పోవడం కాంగ్రెస్‌కు అంతే ముఖ్యం'' అని నారాయణ అన్నారు.
బతికుండగానే సమాధి కట్టుకున్న సీఎం జగన్ - ఏపీలో అధికార మార్పిడి ఖాయం : సీపీఐ నారాయణ జగన్ సంకెళ్లు తెంచుకోవాలి
CPI Narayana on Lok Sabha Elections :లోక్‌సభ ఎన్నికల గురించి నారాయణ మాట్లాడారు. కేరళలో 4 స్థానాల్లో, తమిళనాడులో 2, బంగాల్లో 3, బస్తర్‌లోని ఎంపీ సీట్లకు పోటీ చేస్తామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో ఎంపీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. బతికుండగానే సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధి కట్టుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాస్‌బుక్‌లో జగన్ ఫొటోలు ఎందుకని, ఆయన శాశ్వత ముఖ్యమంత్రి కాదు కదా అని ప్రశ్నించారు.
CPI Leader Narayan Fires on PM Narendra Modi :పార్లమెంట్‌ను కాపాడలేని ప్రధాని, హోం మంత్రి దేశాన్ని ఏం కాపాడతారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. పార్లమెంట్‌లోకి వెళ్లాలంటే నాలుగు అంచెల భద్రత ఉంటుందని, పొగ బాంబు తీసుకెళ్తుంటే ఎందుకు స్కాన్ కాలేదన్నారు. పొగబాంబు తీసుకెళ్లిన వాళ్లకు విజిటర్స్ పాస్ ఇచ్చింది బీజేపీ ఎంపీనేనని ఆరోపించారు.
'ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోతలా జగన్ పాలన: నారాయణ
ధరణి పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మోసాల కంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఎక్కువ తప్పులు చేశారని విమర్శించారు. ప్రతి ఊళ్లో జగన్ సమాధి రాయి వేసుకున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డిపై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. బీజేపీ తెలుగు ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉందన్న ఆయన జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటే అధికార మార్పిడి ఖాయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పూరితంగా కాకుండా వర్క్ పూరితంగా మార్పులు చేసుకోవచ్చని హితవు పలికారు. పదవీ విరమణ పొందిన అధికారులకు ఏ బాధ్యతలు కట్టబెట్టకూడదని హితవు పలికారు.
CPI Leader Chada Fires on BRS Past Ruling :తెలంగాణలోభూ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. నైజాం కాలం నుంచి భూ సమస్యలు నెలకొన్నాయన్న ఆయన ప్రజలకు కొత్త ప్రభుత్వంపై కొండంత అశలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందన్న హరీశ్‌రావు, కేటీఆర్ వ్యాఖ్యలు అహంభావంగా ఉన్నాయని మండిపడ్డారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని ఒక్క రేషన్ కార్డు కూడా తెలంగాణలో ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ రెండు అడుగులు అద్భుతంగా వేసిందని కొనియాడారు. తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రంపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు.
CPI NARAYANA : 'మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోండి'