ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఛలో పోలవరం: గుంటూరులో ముప్పాళ్ల నిర్బంధం - cpi leaders house arrest latest news update

పోలవరం సందర్శనకు సీపీఐ ఇచ్చిన పిలుపు దృష్ట్యా.. కీలక నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. రాజమహేంద్రవరంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. గుంటూరులో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావును గృహ నిర్బంధం చేశారు.

cpi leader muppalla nageswararao house arrest
గుంటూరులో ముప్పాళ్ల గృహనిర్భందం

By

Published : Nov 22, 2020, 7:44 AM IST

Updated : Nov 22, 2020, 10:36 AM IST

పోలవరం సందర్శనకు పిలుపునిచ్చిన సీపీఐ నాయకులను పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను.. రాజమహేంద్రవరంలోని హోటల్ వద్ద పోలీసులు నిర్బంధించారు. అక్కడ భారీగా బందోబస్తును మోహరించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు యాత్ర చేపట్టేందుకు పార్టీ శ్రేణులు సిద్ధపడగా.. పోలీసులు వారిని కట్టడి చేస్తున్నారు. ఈ తీరుపై.. రామకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో యాత్ర చేపడతామన్నారు.

మరోవైపు.. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావును సైతం పోలీసులు గుంటూరులో అర్ధరాత్రి గృహనిర్బంధం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణ తీరు తెలుసుకోటానికి గుంటూరు నుంచి సీపీఐ నాయకులు బయలుదేరేందుకు సిద్ధపడగా అడ్డుకున్నారు.

Last Updated : Nov 22, 2020, 10:36 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details