ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్ఈసీ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి: ముప్పాళ్ల - parishath elections in andhrapradhesh

ఎస్ఈసీ నీలం సాహ్నిపై సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా ఎన్నికలు నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు. ఎస్ఈసీ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సూచించారు.

cpi leader muppalla nageshwararao
సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు

By

Published : Apr 7, 2021, 6:21 PM IST

ఎస్ఈసీ తొందరపాటు నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోయే అవకాశం ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... ఎస్ఈసీ నీలం సాహ్ని ముఖ్యమంత్రి జగన్​కు బంట్రోతుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇష్టానుసారంగా ఎన్నికలు నిర్వహించడం సరైన పద్ధతి కాదని, ఎస్ఈసీ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details