గుంటూరు జిల్లాలోని జిన్నా టవర్ను తొలగించాలని చూస్తే.. ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడతారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. చీప్ లిక్కర్ ధరలు తగ్గిస్తామని బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేసిన భాజపా నేత సోము వీర్రాజు.. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు.. ముప్పాళ్ల హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
గుంటూరులో మత రాజకీయాలకు స్థానం లేదు : ముప్పాళ్ల నాగేశ్వరరావు - ap latest news
గుంటూరులో మత రాజకీయలకు స్థానం లేదని, జిన్నా టవర్ను తొలగించాలని చూస్తే.. ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడతారని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. శాంతియుతంగా ఉండే గుంటూరులో.. మత రాజకీయాలు చెయ్యొద్దని భాజపా నేతలకు సూచించారు.
పార్లమెంటు భవనానికి అబ్దుల్ కలాం పేరు పెట్టాలి..
అబ్దుల్ కలాంపై అంత ప్రేముంటే.. దిల్లీలో నిర్మించే నూతన పార్లమెంటు భవనానికి ఆయన పేరు పెట్టాలని భాజపా నేతలకు సూచించారు. త్వరలో ఏర్పాటు కాబోయే నరసరావుపేట జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టేలా.. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అంతేగాని సామరస్యంగా, శాంతియుతంగా ఉండే గుంటూరులో.. మత రాజకీయాలు చెయ్యొద్దని భాజపా నేతలకు సూచించారు.
ఇదీ చదవండి:
Atchenna On pensions: పింఛన్లపై సీఎం జగన్ మడమ తిప్పారు: అచ్చెన్నాయుడు