కేంద్రంలో, ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన చేస్తున్నారని.. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. గత నెల రోజులు నుంచి రైతులు తమ హక్కులు కోసం దిల్లీలో పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోపోవడం దారుణమన్నారు. ఏపీలో రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు నేడు రోడ్డున పడ్డారన్నారు. అమరావతి రైతులను రోడ్దున పడేసిన జగన్.. నియంత పోకడ ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
'కేంద్రంలో, ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన సాగుతోంది' - గుంటూరు జిల్లా తాజా వార్తలు
కేంద్రంలో, రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ పాలన కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో రైతుల ఆందోళనలు, రాష్ట్రంలో రాజధాని రైతుల ఆందోళనలు ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టడం లేదని ఆయన మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన జగన్.. నేడు కేసులకు భయపడి మోదీకి లొంగిపోయాడని అన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి తాము అనుకూలమని.. అయితే పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలి చాలని సెంట్ స్థలం ఇచ్చి వైకాపా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మంత్రులే మద్యం షాపులు నిర్వహిస్తూ.. మద్యరహిత పాలన అందిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన జగన్.. నేడు కేసులకు భయపడి మోదీకి లొంగిపోయాడరన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో వైకాపా పూర్తిగా విఫలమైందని ముప్పాళ్ల అన్నారు.
ఇదీ చదవండి:ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయ్: ఎంపీ మోపిదేవి వెంకట రమణ