ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిర్మించిన ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఐ ధర్నా - ముప్పాళ్లనాగేశ్వరరావు తాజా వ్యాఖ్యలు

గుంటూరు జిల్లాలో టిడ్కో తరపున నిర్మించిన వేలాది గృహాలు ఖాళీగా ఉన్నాయని సీపీఐ నేతలు మండిపడ్డారు. లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

cpi dharna for houses
లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఐ ధర్నా

By

Published : Oct 20, 2020, 3:27 PM IST

గత ప్రభుత్వ హయాంలో టిడ్కో తరపున పేదల కోసం నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలే వాటిని స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించారు. గుంటూరు నగరపాలక సంస్థ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొన్న ఆయన వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయన్నారు. మరోవైపు లబ్ధిదారులు మాత్రం అద్దె ఇళ్లలో ఉంటున్నారని.. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లించటం భారంగా మారిందని వివరించారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ విషయం గుర్తించి ఇళ్లు పంపిణీ చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details