ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైనార్టీలపై దాడులు అరికట్టాలంటూ సీపీఐ ఆందోళన - వామపక్షాలు

మైనార్టీలపై దాడులు అరికట్టాలంటూ గుంటూరులో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక శంకర్ విలాస్ కూడలి నుంచి లాడ్జ్​ సెంటర్ వరకు సీపీఐ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు.

మైనార్టీలపై దాడులు అరికట్టాలంటూ గుంటూరులో సీపీఐ ఆందోళన

By

Published : Aug 7, 2019, 5:46 PM IST

మైనార్టీలపై దాడులు అరికట్టాలంటూ గుంటూరులో సీపీఐ ఆందోళన

ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీలపై దాడులు అరికట్టాలంటూ గుంటూరులో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మతతత్వ మోదీ ప్రభుత్వం... రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తుందని సీపీఐ రాష్ట్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. మోదీ ప్రభుత్వ నిరంకుశ వైఖరితో దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, మైనార్టీలపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులకు వ్యతిరేకంగా వామపక్షాలు చేపట్టే ప్రజా ఉద్యమానికి అన్నివర్గాలు కలిసి రావాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details