ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలి' - guntur news updates

గుంటూరులో వామపక్ష నేతలు నిరసన చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో జరిగిన విద్యుత్ పోరాటానికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆందోళన చేశారు. తక్షణమే పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

cpi, cpm leaders protest in guntur to demand decrease power charges in state
గుంటూరులో వామపక్ష నేతల నిరసన

By

Published : Aug 28, 2020, 5:36 PM IST

ఉమ్మడి రాష్ట్రంలో చరిత్రాత్మక విద్యుత్ పోరాటం జరిగి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా... గుంటూరులో వామపక్ష నేతలు నిరసన చేపట్టారు. శంకర్ విలాస్ కూడలి వద్ద సీపీఐ, సీపీఎం నేతలు నిరసన తెలిపారు. బషీర్​బాగ్ విద్యుత్ పోరాటంలో అసువులు బాసిన పోరాట యోధులను స్మరించుకున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచిన ఏ ప్రభుత్వమూ ఎక్కువ రోజులు అధికారంలో లేదని హెచ్చరించారు. విద్యుత్ చట్టసవరణ పేరుతో పేదలకు ఇచ్చే రాయితీలు దూరం అవుతున్నాయన్నారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details