ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వానికి సమంజసం కాదు: సీపీఐ - cpi on govt lands selling

భూములు విక్రయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు మార్కెట్ సెంటర్ వద్ద సీపీఐ, అమరావతి పరిరక్షణ సమితి నాయకులు నిరసన చేపట్టారు.

cpi agitation at gunutur market
సీపీఐ ఆందోళన

By

Published : May 17, 2020, 2:05 PM IST

ప్రభుత్వ భూముల విక్రయానికి వ్యతిరేకంగా గుంటూరు మార్కెట్ సెంటర్ వద్ద సీపీఐ, అమరావతి పరిరక్షణ సమితి నాయకులు నిరసన చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న మార్కెట్ పై 10వేల మంది ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు.

వారందరినీ రోడ్లపైకి తేవడం ప్రభుత్వానికి సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు చెప్పారు. ప్రజలే మార్కెట్ ను రక్షించుకుంటారని అన్నారు. న్యాయపోరాటం చేసైనా ప్రభుత్వ భూములు కాపాడతామని అమరావతి పరిరక్షణ సమితి మహిళా నేత డాక్టర్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details