ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ సీపీఐ ఆందోళన - cpi protest on amaravathi in guntur

అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ కోరుతూ గుంటూరు శంకర్​ విలాస్​ కూడలిలో సీపీఐ నేతలు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

గుంటూరులో మూడు రాజధానులకుగా వ్యతిరేకంగా సీపీఐ ఆందోళన
గుంటూరులో మూడు రాజధానులకుగా వ్యతిరేకంగా సీపీఐ ఆందోళన

By

Published : Aug 3, 2020, 6:17 PM IST

గుంటూరులో మూడు రాజధానులకుగా వ్యతిరేకంగా సీపీఐ ఆందోళన

అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ గుంటూరులోసీపీఐ ఆందోళన నిర్వహించింది. శంకర్ విలాస్ కూడలి రోడ్డుపై పడుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు రాజధానుల బిల్లులను రాష్ట్రపతి ఆమోదించవద్దని డిమాండ్ చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుందని ఎన్నికల ముందు చెప్పిన వైకాపా.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరిట దుర్మార్గపు ఆలోచన చేసిందని సీపీఐ నేత అజయ్ కుమార్ విమర్శించారు. వైకాపా ఆడుతున్న నాటకానికి భాజపా సహకరిస్తోందని ఈ రెండుపార్టీల ఆట కట్టించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details